ramnadh kovind: సోదర సోదరీమణుల్లారా, నమస్కారం.. దేశ భాషలందు తెలుగు లెస్స!: రాష్ట్రపతి నోట తెలుగు మాట
- దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు
- తెలుగు మహాసభలకు హాజరైన వారందరికీ అభినందనలు
- ఈ సభకు హాజరైనందుకు సంతోషంగా ఉంది
- తెలుగు భాషాభివృద్ధికి గురజాడ విశేష కృషి చేశారు
'సోదర సోదరీమణుల్లారా నమస్కారం.. దేశ భాషలందు తెలుగు లెస్స' అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలుగు ప్రపంచ మహాసభల్లో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభలు కాసేపట్లో ముగియనున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ముగింపు వేడుకలకు వచ్చిన రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ... దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటని అన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైనందుకు సంతోషంగా ఉందని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. ఈ మహాసభలను ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అభినందలని వ్యాఖ్యానించారు. దేశ, విదేశాల నుంచి తెలుగు మహాసభలకు హాజరైన వారందరికీ అభినందనలని అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి గురజాడ విశేష కృషి చేశారని వ్యాఖ్యానించారు.