india: ప్రధాన ప్రపంచ మహాశక్తి భారత్: అమెరికా

  • భారత్ బలమైన దేశంగా అవతరించడాన్ని స్వాగతిస్తున్నాం
  • ఇండియాకు పూర్తి మద్దతు
  • మరింత క్రియాశీలక పాత్ర పోషించాలి

భారత్ ను ప్రధాన ప్రపంచ మహాశక్తిగా అమెరికా కొనియాడింది. ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంటామని తెలిపింది. తాజాగా నూతన జాతీయ భద్రతా వ్యూహాన్ని అమెరికా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హిందూ మహాసముద్రం భద్రత, సరిహద్దు ప్రాంతాల్లో భారత్ మరింత కీలక పాత్ర పోషించేందుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

 దక్షిణాసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో భారత్ కు మద్దతు ఇవ్వాలని... దీనివల్ల ఈ ప్రాంతంలోని దేశాల సార్వభౌమత్వం కొనసాగుతుందని తెలిపింది. భారత్ బలమైన వ్యూహాత్మక, రక్షణ భాగస్వామిగా అవతరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పింది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ లు వ్యూహాత్మకంగా సహకరించుకుంటాయని తెలిపింది.  

  • Loading...

More Telugu News