telugu maha sabhalu: తెలుగు ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రైన చిరు, బాల‌య్య‌, వెంక‌టేశ్‌, రాజ‌మౌళి.. మ‌రెంద‌రో!

  • ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో భాగంగా సినీ సంగీత విభావ‌రి
  • ఎల్బీ స్టేడియంలో కొన‌సాగుతోన్న కార్య‌క్ర‌మం
  • పాల్గొన్న రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు

హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోన్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో భాగంగా ఈ రోజు ప్రత్యేక కార్యక్రమంగా సినీ సంగీత విభావ‌రి ప్రారంభ‌మైంది. న‌గ‌రంలోని ఎల్బీ స్టేడియంలో కొన‌సాగుతోన్న ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహ‌రి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఈటల రాజేంద‌ర్‌, కేటీఆర్ పాల్గొంటున్నారు. అలాగే, సినీ ప్రముఖులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్‌, జ‌గ‌ప‌తి బాబు, విజ‌య్ దేవరకొండ‌, రాఘ‌వేంద్రరావు, రాజ‌మౌళి, అల్లు అర‌వింద్ తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు.

telugu maha sabhalu
Hyderabad
film actors
  • Loading...

More Telugu News