మమతా బెనర్జీ: గుజరాత్ లో బీజేపీ నైతికంగా ఓడింది: మమతా బెనర్జీ
- గుజరాత్ లో బీజేపీది తాత్కాలిక విజయం
- సమతూకంగా తీర్పిచ్చిన గుజరాత్ ఓటర్లకు అభినందనలు
- పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ
గుజరాత్ లో బీజేపీ నైతికంగా ఓటమిపాలైందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. గుజరాత్ లో బీజేపీ విజయం సాధించడంపై ‘ట్విట్టర్’ ద్వారా ఆమె స్పందించారు. సమతూకంగా తీర్పిచ్చిన గుజరాత్ ఓటర్లకు అభినందనలు తెలుపుతున్నానని, గుజరాత్ లో బీజేపీది తాత్కాలిక విజయమని, అవినీతి, అన్యాయం, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని అన్నారు.