gali muddu krishnama naidu: ఎన్టీఆర్ తో పోల్చుకునే అర్హత నీకు లేదు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పై ముద్దుకృష్ణమ ఫైర్

  • వివాదాల్లోకి ఎన్టీఆర్ ను లాగొద్దు
  • ఎన్టీఆర్ ను మొసలితో పోల్చడం దారుణం
  • తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టీడీపీని స్థాపించారు

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. సాహితీవేత్తగా, కవిగా లక్ష్మీప్రసాద్ కు గుర్తింపు ఉందని, అయితే దివంగత ఎన్టీఆర్ ను వివాదాల్లోకి లాగడం మాత్రం సరైంది కాదని అన్నారు. ఎన్టీఆర్ ను మొసలితో పోల్చడం బాధాకరమని అన్నారు. అలాగే ఎన్టీఆర్ తో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల గుండెల్లో ఆయన నిద్రపోయారని అన్నారు. 

gali muddu krishnama naidu
ntr
Telugudesam
yarlagadda lakshmiprasad
  • Loading...

More Telugu News