ప్రధాని మోదీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: ప్రధాని మోదీ

  • గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై హర్షం
  • రెండు రాష్ట్రాల ప్రజలు చూపిన ప్రేమ, విశ్వాసానికి ధన్యవాదాలు
  • ఆ రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడతాం: మోదీ వరుస ట్వీట్లు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్వీట్లు చేశారు. ‘బీజేపీ పై గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు చూపిన ప్రేమ, విశ్వాసానికి ధన్యవాదాలు. నా శిరస్సు వంచి వారికి నమస్కరిస్తున్నా. ఆయా రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో వేలెత్తి చూపడానికి వీలులేకుండా ఉంటామని హామీ ఇస్తున్నాను. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధికి నిరంతరం పాటుపడతాం. సుపరిపాలన, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు. కష్టపడి పని చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News