‘అజ్ఞాతవాసి’: ‘బాబాయ్! నేను.. సంక్రాంతి దాకా ఎదురుచూడలేను!’ : ‘అజ్ఞాతవాసి’ టీజర్ చూసిన రామ్ చరణ్

  • ‘అజ్ఞాతవాసి’ టీజర్ పై రామ్ చరణ్ ప్రశంసలు
  • బాబాయ్ చాలా బాగా చేశాడు
  • చెర్రీ ‘ఫేస్ బుక్’ పోస్ట్

‘అజ్ఞాతవాసి’ టీజర్ పై ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటులు, ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ చిత్రం టీజర్ అద్భుతమంటూ ప్రశంసలు కురిపించాడు. రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా చేసిన పోస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది.

‘బాబాయ్ చాలా బాగా చేశాడు!!! బాబాయ్ ఇచ్చిన ప్రతి ఎక్స్ ప్రెషన్ నచ్చింది!! నేను.. సంక్రాంతి దాకా ఎదురుచూడలేను!!’ అని ‘అజ్ఞాతవాసి’ విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయాన్ని చెప్పాడు. కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’ వచ్చే నెల 10న విడుదల కానుంది. పవన్ సరసన కీర్తి సురేష్, అనూఇమ్మాన్యుయేల్ నటించారు.

  • Loading...

More Telugu News