Himachal Pradesh: హిమాచల్ లో ఓటమి దిశగా బీజేపీ సీఎం అభ్యర్థి!

  • ప్రత్యర్థికన్నా వెనుకంజలో ప్రేమ్ కుమార్
  • విజయం దిశగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వీరభద్ర సింగ్
  • 38 చోట్ల బీజేపీ, 23 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం

హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ దూసుకెళుతున్నప్పటికీ, ఆ పార్టీ సీఎం అభ్యర్థి మాత్రం ఓటమి దిశగా సాగుతున్నారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్, నాలుగో రౌండ్ లెక్కింపు తరువాత తన సమీప ప్రత్యర్థితో పోలిస్తే వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వీరభద్ర సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. హిమాచల్ బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సింగ్ కూడా విజయం దిశగా దూసుకెళుతున్నారు. మొత్తం 68 స్థానాలున్న రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ 35 కాగా, బీజేపీ ఇప్పటికే 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 23, ఇతరులు 6 చోట్ల ముందంజలో ఉన్నారు.

Himachal Pradesh
BJP
Congress
Election
Prem Kumar
Veerabhadra Singh
  • Loading...

More Telugu News