వీహెచ్: చంద్రబాబు తెలుగువారు కాదా? మహాసభలకు ఎందుకు పిలవలేదు?: కేసీఆర్ పై వీహెచ్ మండిపాటు
- తెలంగాణలో ప్రతిపక్షనేతలు తెలుగువారు కాదా?
- అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ను చంద్రబాబు ఆహ్వానించారుగా?
- సీఎం కేసీఆర్ పై మండిపడ్డ వీహెచ్
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లో జరుగుతున్నవి ప్రపంచ తెలుగు మహాసభలా? లేక కేసీఆర్ కుటుంబ మహాసభలా? అని మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ను చంద్రబాబు ఆహ్వానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలుగు మహాసభలకు చంద్రబాబుని కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదని ఈ సందర్భంగా వీహెచ్ ప్రశ్నించారు. ‘పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి (చంద్రబాబు) తెలుగు వారు కాదా? తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు తెలుగువారు కాదా?’ అంటూ కేసీఆర్ పై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.