ఉత్తరప్రదేశ్: ‘రాహుల్ మిల్క్’ పేరిట వినూత్న ప్రచారం

  • యూపీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత అన్వర్ హుస్సేన్
  • రాహుల్ కు వీరాభిమాని
  • ‘కాంగ్రెస్’లోకి యువత రావాలంటూ వినూత్న ప్రచారం

ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, రాహుల్ కు వీరాభిమాని అన్వర్ హుస్సేన్ వినూత్న ప్రచారం చేపట్టారు. ‘రాహుల్ మిల్క్’, ‘రాహుల్ గాంధీ హెర్బల్ టీ’ పేరిట ఈ వినూత్న ప్రచారం ప్రారంభించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలంటూ గతంలో అన్వర్ హుస్సేన్ తన రక్తంతో లేఖలు రాశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ నిన్న బాధ్యతలు చేపట్టడంతో అన్వర్ సంతోషానికి హద్దుల్లేవు.

కాంగ్రెస్ పార్టీలోకి యువత రావాలంటూ వారిని ప్రోత్సహించే విధంగా ‘రాహుల్ మిల్క్’, ‘రాహుల్ గాంధీ హెర్బల్ టీ’ పేరిట వినూత్న ప్రచారం ఆయన ప్రారంభించారు. కాగా, గతంలో యూపీ ఎన్నికల సమయంలో రాహుల్, అఖిలేష్ కలిసినప్పుడు ‘కరణ్, అర్జున్ కి జోడీ’ అని, ‘కాంగ్రెస్’కు ఓటు వేయాలని కోరుతూ ‘రాహుల్ గులాబీ’లను నాడు ఆయన పంచిపెట్టారు.

  • Loading...

More Telugu News