Amitabh Bachchan: 'ఐష్... ఆరాధ్యలా ఇదేంటి?' అంటూ మందలించిన అమితాబ్.. నాటి వీడియో వైరల్!

  • స్టార్ డస్ట్ అవార్డుల కార్యక్రమంలో ఘటన
  • మామయ్య వైపు వేలు చూపిన ఐశ్వర్య
  • ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్

తన కోడలు ఐశ్వర్యారాయ్ ని సున్నితంగా మందలిస్తున్న అమితాబ్ బచ్చన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో రెండు సంవత్సరాల క్రితం జరిగిన స్టార్ డస్ట్ అవార్డుల ప్రోగ్రామ్ లోదని తెలుస్తుండగా, అదిప్పుడు చక్కర్లు కొడుతోంది. ‘జజ్బా’ చిత్రానికి గానూ ఐశ్వర్యారాయ్, ‘పీకూ’ చిత్రానికిగానూ అమితాబ్ బచ్చన్ లు ఉత్తమ నటీ నటుల అవార్డులను అందుకున్నారు.

అవార్డును తీసుకున్న అనంతరం అమితాబ్‌ తో కలిసి ఫోటో సెషన్ లో పాల్గొన్న ఐష్, 'ఈయనే బెస్ట్‌' అంటూ చిన్నపిల్లలా తన మామయ్య వైపు చూపుడు వేలు చూపింది. వెంటనే స్పందించిన అమితాబ్, చిన్న పిల్లల చేష్టలేంటంటూ, 'ఐష్‌.. ఆరాధ్యలా ప్రవర్తించకు' అని అన్నారట!

Amitabh Bachchan
Aishwarya Rai
Aaradhya
  • Error fetching data: Network response was not ok

More Telugu News