Chandrababu: ఉండవల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు... అమెరికా నుంచి డైరెక్టుగా మాల్దీవులకు లోకేశ్!

  • గన్నవరం నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు
  • ఆపై శంషాబాద్ మీదుగా మాల్దీవులకు
  • ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న లోకేశ్
  • నేరుగా మాల్దీవులకు వెళ్లనున్న లోకేశ్

నేటి నుంచి నాలుగు రోజుల పాటు మాల్దీవుల్లో కుటుంబంతో సహా గడపనున్న ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. తన నివాసం నుంచి రోడ్డుమార్గాన గన్నవరం వెళ్లిన ఆయన, విమానంలో హైదరాబాద్ కు రానున్నారు. ఆపై నేరుగా ఇంటికి వెళ్లి, మధ్యాహ్నం తరువాత కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ కు చేరుకుని, అక్కడి నుంచి మాలేకు వెళ్లనున్నారు.

 ప్రతి సంవత్సరమూ కొన్ని రోజులు కుటుంబంతో కలిసి విదేశాల్లో సేదదీరే ఆయన, ఈ సంవత్సరం మాల్దీవులను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఏపీ మంత్రి, చంద్రబాబు కుమారుడు లోకేశ్, అక్కడి నుంచి నేరుగా మాల్దీవులకు వెళ్లి తనవారితో కలుస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Chandrababu
Lokesh
Male
tour
  • Loading...

More Telugu News