Saptagiri LLB: పవన్ పిలిస్తేనే పార్టీలోకి వెళ్తా... లేకుంటే లేదన్న సప్తగిరి!

  • సప్తగిరి నటించిన తాజా చిత్రం 'సప్తగిరి ఎల్ఎల్ బీ'
  • సొంత జిల్లాలో విజయయాత్రలో చిత్ర బృందం
  • పవన్ పిలిస్తే జనసేనలోకి వెళ్తానని చెప్పిన సప్తగిరి

జనసేన పార్టీకి తాను అవసరమని పవన్ కల్యాణ్, భావించి ఆహ్వానిస్తేనే తాను వెళ్లి ఆ పార్టీలో చేరుతానని నటుడు, కమెడియన్ సప్తగిరి వ్యాఖ్యానించాడు. తన తాజా చిత్రం 'సప్తగిరి ఎల్ఎల్ బీ' విజయవంతమైన నేపథ్యంలో సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన, మీడియాతో మాట్లాడాడు.

తనకు తానుగా రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసిన సప్తగిరి, పవన్ కోరితే తప్పక వెళతానని చెప్పాడు. చిత్తూరులోని ఎంఎస్ఆర్ థియేటరుకు వచ్చిన సప్తగిరి, మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, పవన్ ఎల్లప్పుడూ తన గుండెల్లో ఉంటాడని, హీరోగా తన తొలి చిత్రం 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' ఆడియో ఫంక్షన్ కు వచ్చి ఆశీర్వదించారన్న విషయాన్ని జీవితాంతమూ గుర్తుంచుకుంటానని అన్నాడు. పవన్ పిలిస్తే వెంట వెళ్లడానికి 100 శాతం సిద్ధమని స్పష్టం చేశాడు.

Saptagiri LLB
Chittore
  • Loading...

More Telugu News