Chandrababu: కుటుంబంతో కలసి మాల్దీవుల టూర్ కి ప్లాన్ చేసిన చంద్రబాబు!

  • భార్య, కొడుకు, కోడలు సహా బయలుదేరనున్న చంద్రబాబు
  • తిరిగి 22న రాష్ట్రానికి రాక
  • శీతాకాల విడిదిని ఆస్వాదించనున్న బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తన దైనందిన పరిపాలన, బిజీ లైఫ్ నుంచి మరోసారి సేదదీరనున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో శీతాకాల విడిదిని ఆస్వాదించనున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ కూడా ఆయన వెంట బయలుదేరనున్నారు. వీరితో పాటుగా మరికొందరు నారా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళతారని సమాచారం. నేడు మాల్దీవులకు వెళ్లనున్న ఆయన, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏపీ పర్యటనకు వచ్చే సమయానికి తిరిగి అమరావతి చేరుకుంటారని తెలుస్తోంది. నేడు బయలుదేరి మాల్దీవుల్లో నాలుగు రోజుల పాటు గడపనున్న చంద్రబాబు, తిరిగి 22న రాష్ట్రానికి చేరుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Chandrababu
loke
nara brahmani
bhuvaneshwari
tour
male
  • Loading...

More Telugu News