నటి మీనా: నటి మీనా కూతురు బర్త్ డే వేడుకల్లో రోజా !

  • చిన్నారి నైనికకు శుభాకాంక్షలు చెప్పి..గిఫ్ట్ అందజేసిన రోజా
  • ఈ ఫంక్షన్ కు హాజరైన పలువురు సినీ రంగ ప్రముఖులు
  • ఓ వీడియో పోస్ట్ చేసిన రోజా

సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉండే వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. దక్షిణాది నటి మీనా కూతురు నైనిక పుట్టినరోజు వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో రోజా పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే.. నైనిక’ అంటూ ఏడేళ్ల చిన్నారికి రోజా శుభాకాంక్షలు తెలిపి, గిఫ్ట్ అందజేశారు. ఈ ఫంక్షన్ కు సినీ రంగానికి చెందిన పలువురు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News