debit card: రూ. 2000లోపు డెబిట్ కార్డు చెల్లింపులకు ఎలాంటి ఛార్జీ లేదు... వెల్లడించిన కేంద్రం
- జనవరి 1 నుంచి అమలు
- నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నం
- రెండేళ్ల వరకు ఎండీఆర్ ఛార్జీలు భరించనున్న ప్రభుత్వం
2018, జనవరి 1 నుంచి డెబిట్ కార్డు ద్వారా చేసే రూ. 2000లోపు చెల్లింపులకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించనక్కర లేదని కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం వ్యాపారస్తులకు బ్యాంకులు ఛార్జీ చేసే ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను తామే భరిస్తామని ప్రభుత్వం తెలిపింది. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు రూ. 1000లోపు లావాదేవీలకు 0.25 శాతం, రూ. 1000 నుంచి రూ. 2000 మధ్య లావాదేవీలకు 0.5 శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి ఈ అదనపు ఛార్జీని ప్రభుత్వం భరించనుంది. రెండేళ్ల వరకు ఈ ఛార్జీలను ప్రభుత్వం భరిస్తుంది. ఈ లెక్కన రెండేళ్లకు కలిపి దాదాపు రూ. 2,500 కోట్లు ఎండీఆర్ ఛార్జీల కింద బ్యాంకులకు చెల్లించనుంది.