nagarjuna: తమిళంలోకి నాగ్ భక్తిరస చిత్రం!

  • తెలుగులో నాగ్ చేసిన ' ఓం నమో వేంకటేశాయ'
  • తమిళంలోకి అనువాదం 
  • ఈ నెల 29వ తేదీన విడుదల

తెలుగు తెరపై రొమాంటిక్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న నాగార్జున, ఆ తరువాత భక్తిరస చిత్రాల్లోను మెప్పిస్తూ వస్తున్నారు. అలా ఆయన చేసిన 'అన్నమయ్య' .. 'శ్రీరామదాసు' .. 'శిరిడీ సాయి' సినిమాలు నటుడిగా ఆయన సాధించిన పరిణతికి అద్దం పట్టాయి. ఈ క్రమంలోనే ఆయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఓం నమో వేంకటేశాయ' సినిమా చేశారు.

వేంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడైన 'హాథీ రామ్ బావాజీ' పాత్రలో ఆయన నటించారు. నాగ్ అంతకు ముందు చేసిన భక్తి చిత్రాల స్థాయిలో ఇది ఆడలేదుగానీ ఫరవాలేదనిపించింది. అలాంటి ఈ సినిమాను తమిళంలోకి అనువదించారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను అక్కడ విడుదల చేయనున్నారు. అనుష్క .. ప్రగ్యా జైస్వాల్ .. జగపతిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు చేశారు. ఈ సినిమా అక్కడ ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.      

  • Loading...

More Telugu News