rahul gandhi: రాహుల్ గాంధీ నోటి నుంచి ‘పవర్ ఫుల్' డైలాగులు!
- పదవీ బాధ్యతల అనంతరం ప్రసంగం
- వాడీవేడి కామెంట్స్
- రాజకీయాలు ప్రజల్ని అణచివేసేలా మారాయని ఆవేదన
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కొన్ని వాడియైన వ్యాఖ్యలు చేశారు. వాటిలో కొన్ని...
- ‘‘రాజకీయాలన్నవి ప్రజలకు సంబంధించినవి. కానీ, నేడు రాజకీయాలను ప్రజల కోసం వినియోగించడం లేదు. ప్రజల్ని పైకి తీసుకొచ్చేందుకు వాడుకోవడం లేదు. వారిని అణగదొక్కేందుకే వాడుకుంటున్నారు.
- చాలా మందిలో నేటి రాజకీయాల పట్ల పెద్దగా భ్రమలు లేవు. ఎందుకంటే, నేటి రాజకీయాల్లో దయ, వాస్తవం వంటివి లోపించాయి.
- కాంగ్రెస్ ఇండియాను 21వ శతాబ్దంలోకి తీసుకువస్తే, నరేంద్రమోదీ మనల్ని వెనక్కి మధ్యయుగాల నాటికి తీసుకుపోతున్నారు.
- నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పేదల కోసం పోరాడాలని, అధికారం కోసం పదవిని అంటిపెట్టుకునే వారిని సవాల్ చేయాలని, అప్పుడే వాళ్లు ప్రజల్ని పట్టించుకుంటారని తెలుసుకున్నాను. ఈ తిరోగమన శక్తులు గెలవడం అన్నది వారి శక్తితోనే కానీ అర్హతతో కాదు.
- బీజేపీకి మేము చెప్పేదేమంటే... దేశంలో నిప్పు రాజేస్తే దాన్ని నియంత్రించడం కష్టం. ఈ రోజు బీజేపీ రాజేసిన హింస అనే నిప్పు దేశవ్యాప్తంగా వ్యాపించింది’’