మాజీ మావోయిస్టు: ఆర్థిక ఇబ్బందులతో మాజీ మావోయిస్టు గోపన్న ఆత్మహత్య!
- రైలు కిందపడి ఆత్మహత్య
- మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పని చేసిన అనుభవం
- నాలుగైదేండ్ల క్రితం పోలీసులకు లొంగిపోయిన గోపన్న
రైలు కిందపడి మాజీ మావోయిస్టు గోపన్న అలియాస్ కోమళ్ళ శేషగిరిరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా తొర్రూర్ మండలం వెలికట్టె గ్రామానికి చెందిన గోపన్న కోమటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గతంలో మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా గోపన్న పనిచేశాడని, నాలుగైదేండ్ల క్రితం పోలీసులకు లొంగిపోయి..సాధారణ జీవితం గడుపుతున్నట్టు చెప్పారు. గోపన్న ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆయన కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు.