మేడ్చల్: వ్యభిచారం కేసు.. పోలీసుల అదుపులో ముగ్గురు మోడళ్లు, సినీ ఆర్టిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్!

  • ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన
  • వెంకటాద్రి టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో వ్యభిచారం
  • నిందితులు సినీ ఆర్టిస్ట్ యార్లగడ్డ రవికుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ మూల రాజశేఖర్ రెడ్డి

ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న కేసులో ముగ్గురు మోడళ్లు, సినీ రంగానికి చెందిన ఓ ఆర్టిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులకు పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాద్రి టౌన్ షిప్ బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటిపై ఎస్ టీఓ పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మోడళ్లు, సినీ ఆర్టిస్ట్ యార్లగడ్డ రవికుమార్, సినీ అసిస్టెంట్ డైరెక్టర్ మూల రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఓటీ పోలీసులు మాట్లాడుతూ, విటులను ఆన్ లైన్ ద్వారా ఆకర్షిస్తూ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, నిందితులు ఐదుగురిని ఘట్ కేసర్ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News