కేవీపీ: టీడీపీ కార్యదర్శి గన్నె ప్రసాద్ పై మండిపడ్డ ఏపీసీసీ!

  • కేవీపీపై గన్నె ప్రసాద్ చేసిన ఆరోపణలు, విమర్శలపై ఖండన
  • వాస్తవాలు చెబుతుంటే టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది
  • ఏపీసీసీ కార్యదర్శి బషీర్ అహ్మద్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుపై టీడీపీ కార్యదర్శి గన్నె ప్రసాద్ చేసిన ఆరోపణలు, విమర్శలను ఏపీసీసీ కార్యదర్శి బషీర్ అహ్మద్ ఖండించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న కేవీపీ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని, ఏపీకి ప్రత్యేకహోదా సాధించేందుకు రాజ్యసభలో ప్రత్యేక బిల్లును కేవీపీ ప్రవేశపెట్టిన సంగతి ప్రసాద్ కు తెలియదా? అని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్ట్ కు అనుమతులు సాధించి, కాలువలు తవ్వించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, వాస్తవాలు చెబుతుంటే టీడీపీ జీర్ణించుకోలేకనే కేవీపీపై విమర్శలు గుప్పిస్తోందని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టం హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు. చేతనైతే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారులో ఉన్న టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించేలా సీఎం చంద్రబాబుపై గన్నె ప్రసాద్ ఒత్తిడి తీసుకురావాలని బషీర్ అహ్మద్ సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News