శీతాకాల సమావేశాలు: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
- లోక్ సభ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం
- వారిని సభకు పరిచయం చేసిన ప్రధాని
- సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలి: మోదీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొంచెం సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు నేటి నుంచి 14 రోజుల పాటు జరగనున్నాయి. లోక్ సభకు నూతనంగా ఎన్నికైన సభ్యులతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రమాణం చేయించారు. అనంతరం, సభకు నూతన సభ్యులను ప్రధాని మోదీ పరిచయం చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని, ప్రభుత్వం కీలక బిల్లులను సభముందు ప్రవేశ పెడుతుందని అన్నారు. అన్ని అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరగాలని కోరుకుంటున్నానని మోదీ అన్నారు.