వైసీపీ ఎమ్మెల్యే రోజా: నన్ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • వైసీపీని విడిచి టీడీపీలోకి రమ్మంటున్నారు
  • చంద్రబాబు కారణంగానే నాడు టీడీపీని వీడాను
  • మాధవరెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ లను తొక్కేసింది చంద్రబాబే 

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, వైసీపీని విడిచి టీడీపీలోకి తనను రమ్మనమంటూ ఆహ్వానం వచ్చిందని చెప్పారు. ఈ ఆహ్వానం విషయమై సరైన సమయంలో తాను మాట్లాడతానని ఆమె పేర్కొనడం గమనార్హం. నాడు టీడీపీ లో ఉన్న తాను ఆ పార్టీ  నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని రోజా చెప్పారు.

పర్టిక్యులర్ గా ఒక్క నియోజకవర్గం నుంచి అని కాకుండా నగరి, చంద్రగిరి.. ఇలా ఎక్కడంటే అక్కడ తనను పోటీ చేయాలంటూ చంద్రబాబు నాడు ఇబ్బంది పెట్టారని, అందుకే, టీడీపీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మరో ఆరోపణ కూడా ఆమె చేశారు. నాడు టీడీపీలో ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ లను ఎదగనీయకుండా చంద్రబాబు తొక్కేశారని ఆరోపించారు. తనకంటే ఎక్కువ పేరు సంపాదించుకునే వారిని తొక్కేయడం ఆయనకు అలవాటేనంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

  • Loading...

More Telugu News