మహేష్ బాబు: హీరో మహేష్ బాబు దగ్గరి బంధువు 'పద్మాలయ రాంబాబు' మృతి!
- మహేష్ బాబుకు ఆయన మామయ్య వరుస
- మహేష్ కి పర్సనల్ మేనేజర్ గా కూడా పనిచేశారు
- సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ హీరో మహేష్ బాబు కుటుంబానికి దగ్గరి బంధువు 'పద్మాలయ రాంబాబు'గా సుపరిచితులైన శాఖమూరి రాంబాబు మృతి చెందారు. మహేష్ బాబుకు ఆయన మామయ్య వరుస అవుతారు. రాంబాబు మృతి పట్ల ఆయన కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, మహేష్ బాబుకు కొంతకాలం పాటు ఆయన పర్సనల్ మేనేజర్ గా కూడా వ్యవహరించారు. మహేష్ సోదరుడు రమేష్ బాబుతో ఓ చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు.