subhalekha sudhakar: నాలో నాకు నచ్చనిది నా మంచితనమే .. అయినా నేను మారను: శుభలేఖ సుధాకర్

  • శైలజకి ఓర్పు ఎక్కువ 
  • ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది
  • ఆకలంటే ఏమిటో నాకు తెలుసు

తెలుగులో విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించిన 'శుభలేఖ' సుధాకర్, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. తన భార్య ప్రస్తావన వచ్చినప్పుడు " శైలజకి ఓర్పు ఎక్కువ .. నిండు కుండ .. తొణకదు. ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. బయటికి ఆమె చాలా సీరియస్ గా కనిపిస్తుంది గానీ, చాలా సెన్సాఫ్ హ్యూమర్ వుంది" అని అన్నారు.

"ఇక నా విషయానికే వస్తే .. నాలో నాకు నచ్చని గుణం .. మంచితనం. నాకు ఆకలంటే ఏమిటో తెలుసు .. కష్టమంటే ఏమిటో తెలుసు. ఇవన్నీ నేను భరించాను గనుక .. అలాంటి పరిస్థితుల్లో వున్న వారికి హెల్ప్ చేస్తుంటాను. ఆ తరువాత ఎన్నో సందర్భాల్లో నేను నేర్చుకున్న పాఠమేమిటంటే, నా మంచితనాన్ని చాలా మంది వాడుకున్నారు. అయినా నేను మారలేదు .. మారను.. అలాగే వుంటాను" అంటూ సెలవిచ్చారు.      

subhalekha sudhakar
sailaja
  • Error fetching data: Network response was not ok

More Telugu News