nara brahmani: రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న బ్రాహ్మణి

  • ఇంధన ఆదాలో హెరిటేజ్ కు అవార్డ్
  • ఢిల్లీలో కొనసాగుతున్న అవార్డుల కార్యక్రమం
  • కాసేపట్లో అవార్డు అందుకోనున్న బ్రాహ్మణి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి కాసేపట్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న హెరిటేజ్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. మన దేశంలో ఇంధన ఆదాలో ప్రతిభ కనబరిచిన పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఇందులో హెరిటేజ్ కూడా ఉంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది. ఎంపికైన సంస్థల ప్రతినిధులకు రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేయనున్నారు. 

nara brahmani
Chandrababu
heritage foods
  • Loading...

More Telugu News