Rajesh: భర్త అంటే తనకు అసహ్యమని స్వాతి చెప్పింది... విడిచి ఉండలేక ఇలా చేశాము!: రాజేష్

  • అమె అంటే చాలా ఇష్టం
  • అందుకే భరించలేని నొప్పిని భరించాలని భావించాను
  • రాజేష్ నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు

స్వాతి అంటే తనకెంతో ఇష్టమని, తన భర్తంటే తనకు అసహ్యమని స్వాతి చెప్పినందునే ఈ పని చేశానని రాజేష్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ ఉదయం నుంచి అతన్ని ప్రశ్నిస్తున్న నాగర్ కర్నూలు పోలీసులు, అతని నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. స్వాతితో ఎలా పరిచయమైందన్న విషయం నుంచి, వారిద్దరి మధ్యా బంధం, సుధాకర్ ను హత్య చేసిన తీరు గురించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

సుధాకర్ కు ఇచ్చిన మత్తు ఇంజక్షన్ ఎక్కడిదన్న వివరాలూ సేకరించారు. వ్యక్తిగతంగా తనకు సుధాకర్ తో సరిగ్గా పరిచయం కూడా లేదని తెలిపాడు. స్వాతిపై ప్రేమతోనే భరించలేని నొప్పిని సైతం భరించాలని నిర్ణయించుకున్నానని, అందుకే ముఖాన్ని కాల్చుకునేందుకు కూడా వెనుకాడలేదని తెలిపాడు. తనకు మాంసాహారం తినడం చిన్నప్పటి నుంచి అలవాటు లేదని కూడా రాజేష్ వెల్లడించాడు. కాగా, ఈ కేసులో పోలీసులకు తొలి అనుమానం ఆసుపత్రి బెడ్ పై సుధాకర్ రూపంలో ఉన్న రాజేష్, మటన్ సూప్ ను నిరాకరించడంతోనే వచ్చిందన్న సంగతి తెలిసిందే.

Rajesh
Swathi
Nagar Kurnool
Acid Attack
  • Loading...

More Telugu News