Rajesh: నన్ను వదిలి ఉండలేనని బతిమాలింది.. అందుకే హత్యకు సహకరించాను!: స్వాతి ప్రియుడు రాజేష్

  • సుధాకర్ రెడ్డితో ఎలాంటి గొడవలూ లేవు
  • నేను కేవలం హత్యకు సహకరించాను
  • పోలీసుల విచారణలో రాజేష్

తనకు సుధాకర్ రెడ్డితో వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలూ లేవని, కేవలం స్వాతి కోరిక మీదటే అతని హత్యకు సహకరించానని రాజేష్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించినట్టు సమాచారం. తన ప్రియుడిని తీసుకొచ్చి భర్త స్థానంలో కూర్చోబెట్టాలన్న స్వాతికి సహకరించి, ఆపై ఎవరూ చేయలేనంత ధైర్యం చేసి ముఖాన్ని సైతం కాల్చుకున్న రాజేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారించడం ప్రారంభించారు.

 ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న రాజేష్, స్వాతి కోరిక మేరకే తానీ ఘాతుకానికి అంగీకరించినట్టు ఒప్పుకున్నాడని పోలీసుల సమాచారం. స్వాతికి, తనకు పరిచయం, అనుబంధం ఉన్నమాట వాస్తవమేనని, సుధాకర్ రెడ్డి అంటే తనకు ఇష్టం లేదని, అతను తనకు వద్దని, ఎలాగైనా కలిసుందామని ఆమె చెప్పిన మాటలు నమ్మి ఈ పనికి పాల్పడ్డానని రాజేష్ వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

Rajesh
Swathi
Acid Attack
  • Loading...

More Telugu News