Pansinic: పానసోనిక్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఎలుగా సిరీస్‌లో అదిరిపోయే ఫీచర్లతో నయా స్మార్ట్‌ఫోన్!

  • ఎలుగా ఐ9 పేరుతో మార్కెట్లో మరో ఫోన్
  • రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి
  • ధర రూ.7,499

పానసోనిక్ ఇండియా నుంచి బుధవారం మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎలుగా ఐ9’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.7,499 మాత్రమే. రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.

ఎలుగా ఐ9 ఫీచర్లు..
* 5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ హెచ్‌డీ డిస్ ప్లే
* 8 గంటల వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్
* 2500 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 3జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు
* 13 ఎంపీ ఆటో ఫోకస్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ షూటర్
* ఆండ్రాయిడ్ నోగట్ 7.0 ఓఎస్

  • Loading...

More Telugu News