India: రెండో వన్డే: టీమిండియా ఘన విజయం
- నిర్ణీత ఓవర్లలో టీమిండియా స్కోరు 392/4
- 50 ఓవర్లలో శ్రీలంక పరుగులు 251/8
- ధాటిగా ఆడి శతకం చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ మాథ్యూస్
- 3 వన్డేల సిరీస్‌లో భారత్, శ్రీలంక 1-1 తో సమం
మొహాలీలో జరిగిన భారత్, శ్రీలంక రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 141 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సెంచరీ బాది.. మాథ్యూస్ చేసిన ఒంటరి పోరాటం వృథా అయిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రీలంక ముందు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో క్రీజులోకి వచ్చిన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో గుణతిలక 16, తరంగ 7, తిరిమన్నే 21, డిక్ వెల్లా 22 , అసెలా గుణరత్నే 34, పెరెరా 5, పతిరన 2, ధనంజయ 11, మాథ్యూస్ 111 (నాటౌట్), లక్మల్ 11 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 50 ఓవర్లలో శ్రీలంక 251 పరుగులు చేసింది.
టీమిండియా బౌలర్లలో చాహెల్ 3 వికెట్లు తీయగా, బుమ్రా 2 వికెట్లు తీశాడు. పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హార్ధిక్ పాండ్యాలకు చెరో వికెట్ లభించాయి. భారత బ్యాట్స్ మెన్ లో రోహిత్ శర్మ 208, శిఖర్ ధావన్ 68, అయ్యర్ 88, ధోనీ 7, పాండ్యా 8 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో 3, పతిరన ఒక్క వికెట్ తీశారు.
మొదటి వన్డేలో శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. ఈ వన్డే సిరీస్‌లో భారత్, శ్రీలంక 1-1 తో సమంగా ఉన్నాయి. దీంతో వచ్చే ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.