Rohit Sharma: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

  • ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయుడిగా రికార్డు
  • 40 సిక్సులు కొట్టిన సచిన్
  • 41 సిక్సర్లు బాదిన రోహిత్

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. 12 సిక్సర్లు, 13 ఫోర్లతో విరుచుకుపడ్డ రోహిత్ శర్మ వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు 40 సిక్సులు కొట్టిన సచిన్ పేరిట ఉండేది. సచిన్ పేరిట ఉన్న రికార్డును, ఈ రోజు 41 సిక్సులతో రోహిత్ అధిగమించాడు.

అంతేకాదు, ఒక ఏడాదిలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ చేరాడు. ఈ జాబితాలో తొమ్మిది సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో ఉండగా, 6 సెంచరీలతో కోహ్లీతో కలసి మూడో స్థానంలో రోహిత్ నిలిచాడు.

  • Loading...

More Telugu News