Roja: మళ్లీ సీఎం చాన్స్ తనకు లేదని చంద్రబాబుకు తెలుసు: రోజా

  • ప్రజలు చంద్రబాబును ఆదరించే పరిస్థితి లేదు
  • ఆధునికీకరణ పేరిట ప్రజలను దోచుకుంటున్న బాబు
  • పేదవారికి నిత్యావసరాలు దూరం: రోజా విమర్శలు

తాను మరొకసారి ముఖ్యమంత్రిని కాలేనన్న విషయం చంద్రబాబునాయుడికి తెలుసునని, ప్రజలు తనను ఆదరించరని ఆయన గ్రహించారని వైకాపా నేత రోజా విమర్శించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, పోలవరం ప్రాజెక్టు పేరిట వందల కోట్లు దోచుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఆధునికీకరణ పేరిట ప్రజలను దోచుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారని దుయ్యబట్టారు.

రేషన్ షాపులను మారుస్తున్నామని చెబుతూ, హెరిటేజ్, రిలయన్స్ సంస్థలకు వాటిని అప్పగించారని, దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. పేదవారికి నిత్యావసర వస్తువులను దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు, ఆయన కుటుంబీకులకు వాటాలున్న హెరిటేజ్, రిలయన్స్ ఉత్పత్తులను మాత్రమే చంద్రన్న మాల్స్ లో అందుబాటులో ఉంచనున్నారని, దీని వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు.

Roja
Chandrababu
Chandranna malls
  • Loading...

More Telugu News