kim jong un: అణ్వాయుధ శక్తిగా ఎదిగాం.. అమెరికాపై పోరాటంలో గెలిచితీరుతాం: కిమ్ జాంగ్ ప్రతిజ్ఞ

  • సామ్రాజ్యవాదులపై పోరాటంలో గెలుస్తాం
  • ఉత్తర కొరియా బలమైన అణ్వాయుధ శక్తిగా ఎదిగింది
  • మరింత బలోపేతమయ్యే కార్యక్రమం కొనసాగుతుంది

జీవన్మరణ పోరాటంలో తాము గెలిచామని... అణ్వాయుధ శక్తిగా ఎదిగేందుకు తాము చేసిన ప్రయత్నం విజయవంతమైందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తెలిపారు. అమెరికాతో జరిగే పోరాటంలో గెలిచి తీరుతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అణ్వాయుధ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులతో కిమ్ జాంగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ దేశం ప్రపంచంలోనే బలమైన అణ్వాయుధ శక్తిగా ఎదిగిందని, సైనిక శక్తిగా అతి పెద్ద ముందడుగు వేసిందని ఆయన అన్నారు. తమ రక్షణ పరిశ్రమ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. సామ్రాజ్యవాదులపై తమ దేశం గెలుస్తుందని అన్నారు. మరోవైపు, ఉత్తర కొరియా అణు పరీక్షలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర కొరియాతో చర్చలకు తాము సిద్ధమని అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ ప్రకటించారు.

kim jong un
North Korea
  • Loading...

More Telugu News