Taiwan: మా దేశంలో అంత సీన్ లేదు: మోదీపై విమర్శలకు స్పందించిన తైవాన్ యువతి... వీడియో చూడండి!

  • మా దేశంలో అంత ఖరీదైన పుట్టగొడుగులు ఉన్నట్టే వినలేదు
  • మష్రూమ్స్ తింటే రంగు మారడం అసాధ్యం
  • కాంగ్రెస్ నేత విమర్శలపై స్పందించిన తైవాన్ యువతి

ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు రూ. 4 లక్షల విలువైన పుట్టగొడుగులను తైవాన్ నుంచి తెప్పించుకు తింటుంటాడని, అందువల్లే ఆయన మేని ఛాయ మరింత కాంతిమంతమైందని గుజరాత్ ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ చేసిన విమర్శలపై, అనుకోని స్పందన తైవాన్ నుంచి వచ్చింది. తైవాన్ కు చెందిన మెస్సీ జోయ్ అనే యువతి ఓ వీడియోను పోస్టు చేస్తూ, అటువంటి పుట్టగొడుగులు తమ దేశంలో లేనే లేవని తేల్చి చెప్పింది.

"నా పేరు మెస్సీ జోయ్. నేను తైవాన్ వాసిని. ఈ రోజు ఇండియా నుంచి వచ్చిన ఓ వార్తను చదివాను. ఓ భారత నేత మాట్లాడుతూ, తైవాన్ లో ఒక్కో మష్రూమ్ 1,200 డాలర్లకు లభిస్తుందని, అది తింటే, చర్మం రంగు మారుతుందని చెప్పారు. అటువంటిది నా దేశంలో ఉన్నట్టు ఇంతవరకూ వినలేదు. అసలది అసాధ్యం కూడా" అని చెప్పింది. గుజరాత్ ఎన్నికల సభలో అల్పేష్ మాట్లాడుతూ, 35 సంవత్సరాల నాడు మోదీ నల్లగా ఉండేవారని, ఇప్పుడు చాలా రంగు తేలారని, అందుకు రోజుకు రూ. 4 లక్షల విలువైన నాలుగు పుట్ట గొడుగులను తైవాన్ నుంచి తెప్పించుకుని నిత్యమూ తింటున్నట్టు తెలిసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. మెస్సీ జోయ్ వీడియోను మీరూ చూడవచ్చు.

Taiwan
Mushrooms
Rs. 4 lakhs
Narendra Modi
Alpesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News