కర్నూల్: కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • ఈ నెల 19న జారీ కానున్న నోటిఫికేషన్
  • జనవరి 12న పోలింగ్
  • 16న ఓట్ల లెక్కింపు

కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కర్నూలు ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19న సంబంధిత నోటిఫికేషన్ జారీ కానుంది. జనవరి 12న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా, శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఎమ్మెల్సీ ఎన్నిక తప్పనిసరైంది.

  • Loading...

More Telugu News