కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి: ‘లక్ష్మీపార్వతి గారూ! ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా’: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సవాల్
- లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సవాల్
- ఆమె మాట్లాడిన మాటలకు ఆమె ఇంటి ముందు ధర్నా చేయాలి
- అన్న ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమతో ఆ పనిచేయట్లేదు : కేతిరెడ్డి
‘లక్ష్మీపార్వతిగారూ! మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు నేను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా’ చెప్పండి అంటూ లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘లక్ష్మీపార్వతిగారూ! చెప్పండి..ఎక్కడికి రమ్మంటారు? నువ్వు మాట్లాడిన మాటలకు నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసేందుకు సిద్ధమే.
కానీ, అన్న ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రేమ కారణంగా నేను ఆ పని చేయట్లేదు. మద్రాసు నుంచి తమిళులు, తెలుగు వాళ్లు నన్ను తరిమేశారని తప్పుడు వ్యాఖ్యలు చేస్తారా? తమిళ హాస్యనటుడు వడివేలును కొట్టడానికి వాళ్ల ఇంటిపైకి వెళ్లినవాడిని నేను! వడివేలే నన్ను ఏం చేయలేకపోయాడు’ అని అన్నారు. తెలుగు భాష కోసం నాటి సీఎం జయలలితనే ఎదిరించిన వాడిని.. తమిళ పేపర్లలో జయలలితపై స్టేట్ మెంట్లు ఇచ్చిన వాడిని.." అంటూ ఆవేశానగా మాట్లాడారు.