లక్ష్మీపార్వతి: లక్ష్మీపార్వతి! నీ వ్యవహారమంతా నాకు తెలుసు: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

  • లక్ష్మీపార్వతి..నీ పుట్టిన ఊరికు, మెట్టిన ఊరికి వస్తా
  • నీ బెదిరింపులకు బెదిరేవాళ్లం కాదు
  • ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి

లక్ష్మీపార్వతి వ్యవహారమంతా తనకు తెలుసని 'లక్ష్మీస్ వీరగ్రంథం' చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘లక్ష్మీపార్వతి.. నీ పుట్టిన ఊరుకు, మెట్టిన ఊరు (వీరగంధం సుబ్బారావు ఊరు)కు వస్తా. నీ జీవితం ఏంటి? కథేంటి? వ్యవహారమేంటనేది నాకు తెలుసు. పోలీసులను పెట్టి బెదిరిస్తాను, మరొకళ్లను పెట్టి బెదిరిస్తానంటే బెదిరేవాళ్లం కాదు. మేము ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్లం.

‘మద్రాసు నుంచి తమిళులు, తెలుగు వాళ్ల నన్ను తరిమేశారని’ మీడియా ద్వారా అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారు. నన్ను తరిమేసే దమ్మూ ధైర్యం ఎవరికి వున్నాయి? నన్ను తమిళనాడు నుంచి తరిమేశారని అంటారా? ఇప్పుడు నేను తమిళనాడులోనే ఉన్నా. ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం వచ్చా..’ అంటూ లక్ష్మీ పార్వతిపై కేతిరెడ్డి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News