Jaya Bhattacharya: నటిగా అవకాశాల కోసం ప్రాధేయపడుతున్న పాప్యులర్ స్టార్... పని కావాలంటూ వేడుకోలు!

  • 'క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ'లో పాయల్ గా మెప్పించిన జయా భట్టాచార్య
  • ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని, అవకాశాలు లేక అవస్థలు
  • చాన్స్ ల కోసం వేడుకుంటున్న నటి!

జయా భట్టాచార్య... ఈ పేరు చెబితే గుర్తుకు రాకపోవచ్చేమోకానీ, 'క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ' సీరియల్ లో పాయల్ మెహ్రా అంటే మాత్రం ప్రతి ఒక్కరికీ గుర్తు వస్తుంది. భారత బుల్లి తెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన తొలి సీరియల్ గా 'క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ' కొన్నేళ్లు షేక్ చేసింది. అందులోని ప్రధాన నటుల్లో ఒకరైన జయ, ఇప్పుడు అవకాశాల కోసం ప్రాధేయపడుతోంది.

తనను ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టాయని, తల్లికి ఆరోగ్యం బాగాలేదని, తనకు ఏదైనా పని ఇవ్వాలని వేడుకుంటూ ఓ వీడియోను పోస్టు చేసింది. తనపై ఆధారపడిన వారి బాగోగులను తాను చూసుకోవాల్సి వుందంటూ, అవకాశాలు ఇవ్వాలని కోరింది. తన తల్లిని గత నెల 26 నుంచి ఆసుపత్రిలో చేర్చానని, ఇదే సమయంలో ఇంటి మరమ్మతు పనులను పెట్టుకోవడంతో ఉండేందుకు ఇల్లు కూడా లేదని చెప్పుకొచ్చింది. తనకు నటిగా అవకాశాలు ఇవ్వాలని ప్రాధేయపడింది.


Jaya Bhattacharya
'Kyon Ki Saas Bhi Kabhi Bahu Thi
Payal Mehra
  • Error fetching data: Network response was not ok

More Telugu News