Tirumala: తిరుమలలో పుర్రె, ఎముకలు... తీవ్ర ఆందోళనలో భక్తులు!

  • జింకల పార్కు వద్ద కనిపించిన పుర్రె
  • నిత్యమూ రద్దీగా ఉండే నడకదారిలో కలకలం
  • విచారణ ప్రారంభించిన పోలీసులు

నిత్యమూ యాత్రికులతో రద్దీగా ఉండే తిరుమల కొండపై పుర్రె, ఎముకలు బయటపడటం కలకలం రేపుతోంది. వేలాది మంది భక్తులు ప్రయాణిస్తుండే, నడకదారిలోని జింకల పార్కు వద్ద ఈ ఉదయం పుర్రె, ఎముకలు భక్తుల కంటపడటంతో వారు ఆందోళనకు గురయ్యారు. నిత్యమూ రద్దీగా ఉండే ఘాట్ రోడ్డుకు అత్యంత సమీపంలోనే జింకల పార్కు ఉంటుంది. తిరుమల నుంచి కిందకు దిగివచ్చే వారు ఇక్కడ ఆగి, జింకలకు ఆహారాన్ని తినిపించి వెళుతుంటారు. అటువంటి ప్రదేశానికి వీటిని ఎవరు, ఎక్కడి నుంచి తెచ్చి వేశారన్న విషయమై, భక్తుల నుంచి సమాచారాన్ని అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Tirumala
Ghat Road
Deer Park
  • Loading...

More Telugu News