rajnikanth: ర‌జ‌నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'కాలా' సెకండ్ లుక్‌... విడుద‌ల చేసిన ధ‌నుష్‌

  • కాలా చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అల్లుడు ధ‌నుష్‌
  • ర‌ఫ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్న సూప‌ర్‌స్టార్‌
  • స్టైల్‌కి చిరునామాగా ఉందంటున్న నెటిజ‌న్లు

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'కాలా' సెకండ్ లుక్‌ను అల్లుడు, చిత్ర నిర్మాత ధ‌నుష్ విడుద‌ల చేశారు. నలుపు రంగు చొక్కా, క‌ళ్ల‌ద్దాలు, చెదిరిన గ‌డ్డంతో రఫ్‌లుక్‌లో క‌నిపిస్తున్న ర‌జ‌నీ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ లుక్ నిజంగా స్టైల్‌కి చిరునామాగా ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

'కింగ్ ఆఫ్ స్టైల్‌' అంటూ ధ‌నుష్ ఈ సెకండ్ లుక్‌ని ట్వీట్ చేశారు. క‌బాలి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పా రంజిత్ ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో హ్యూమా ఖురేషీ, సాక్షి అగ‌ర్వాల్‌, నానా ప‌టేక‌ర్‌, పంక‌జ్ త్రిపాఠిలు న‌టిస్తున్నారు.

  • Loading...

More Telugu News