kcr: జ్ఞాన‌పీఠ్ అవార్డుల గ్రహీత‌ల‌ను స‌త్క‌రిస్తాం: సీఎం కేసీఆర్

  • ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో సమీక్ష
  • ప్ర‌పంచ తెలుగు మహాసభలు పేరుకు అనుగుణంగా జ‌ర‌గాలి
  • ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు-కేసీఆర్‌

ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రధాన ఘట్టాలైన ప్రారంభ సమావేశం, ముగింపు సమావేశాల విషయంలో నిర్ణయాత్మకంగా ఉండాలని అధికారులకు, నిర్వాహకులకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై కేసీఆర్ ఈ రోజు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ప్రపంచ తెలుగు మహాసభలు పేరుకు అనుగుణంగా సాహిత్యం ప్రధానంగా జ‌ర‌గాల‌ని అన్నారు.

హైద‌రాబాద్‌లోని ఎల్బీస్టేడియం ప్రాంగణంలో సభలు జరిగే ఐదు రోజులపాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా ఉండాల‌ని ఆదేశించారు. ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వస్తార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా సాహిత్య అకాడ‌మీ ఛైర్మ‌న్, ఇత‌ర నిర్వాహ‌కుల నుంచి స‌మావేశాల స‌న్నాహ‌క కార్య‌క్ర‌మాల‌ గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ భార‌తీయ భాష‌ల్లో ర‌చ‌న‌లు చేసి జ్ఞాన‌పీఠ్ అవార్డులను  పొందిన వారిని ప్ర‌త్యేకంగా ఆహ్వానించి స‌త్క‌రించాల‌ని ముఖ్యమంత్రి చెప్పారు.    

  • Loading...

More Telugu News