actor vijay suicide: వచ్చిన సంపాదనంతా అమ్మాయిలకే ఖర్చు చేసేవాడు: నటుడు విజయ్ భార్య వనితా రెడ్డి

  • విజయ్ కు అమ్మాయిల పిచ్చి
  • ఆత్మహత్య ఆయన కాదు.. నేను చేసుకోవాలి
  • ఆయన వద్దకు వెళ్లినప్పుడు గొడవపడలేదు

తన భర్త విజయ్ కు అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉండేదని... వచ్చిన సంపాదనంతా అమ్మాయిలకే ఖర్చు చేసేవాడని ఆయన భార్య వనితారెడ్డి ఆరోపించారు. ఇలాంటివి మానుకోవాలని తాను ఎన్నో సార్లు చెప్పానని... అయినా పట్టించుకోలేదని... పైగా తనపై దాడి చేశాడని చెప్పారు. తనను ఏనాడూ మంచిగా చూసుకోలేదని ఆమె అన్నారు.

ఆత్మహత్యకు పాల్పడాల్సింది ఆయన కాదని... తానని అన్నారు. తమ కూతురు వారంలో రెండు రోజులు తండ్రి వద్ద ఉండాలంటూ కోర్టు ఆదేశించిందని... కోర్టు ఆదేశాల మేరకు కూతురుని విజయ్ తీసుకెళ్లాడని, పాపను మళ్లీ తీసుకొచ్చేందుకు తాను విజయ్ వద్దకు వెళ్లానని తెలిపారు. ఆ సమయంలో తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. నటుడు విజయ్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో ఆత్యహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే.



actor vijay suicide
actress vanitha reddy
  • Loading...

More Telugu News