actor vijay: విజయ్ కు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. శశిధర్ ఎవరో నాకు తెలియదు: నటుడు విజయ్ భార్య వనితారెడ్డి

  • రెండేళ్ల నుంచి విడివిడిగా ఉంటున్నాం
  • శశిధర్ తో లింక్ పెట్టి మాట్లాడవద్దు
  • విజయ్ నన్ను చిత్ర హింసలు పెట్టాడు

తన భర్త విజయ్ సాయి, తాను చాలా కాలంగా విడిపోయి బతుకుతున్నామని... ఇప్పటికిప్పుడు అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదని ఆయన భార్య వనితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి కోర్టులో తమ డైవోర్స్ కేసు నడుస్తోందని చెప్పారు. విజయ్ కు వేరే అమ్మాయితో సంబంధం ఉందని... ఆ విషయాన్ని తాను కళ్లారా చూశానని... అప్పటి నుంచే తమ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని తెలిపారు. విజయ్ తండ్రికి కూడా ఈ విషయాన్ని చెప్పానని... ఆయన కూడా పట్టించుకోలేదని చెప్పారు. శశిధర్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని అన్నారు. శశిధర్ అనే వ్యక్తికి, తనకు లింక్ పెట్టి మాట్లాడవద్దని వేడుకున్నారు.

తన పాపను విజయ్ కు దూరం చేయలేదని వనిత తెలిపారు. ఆయన ఏం సంపాదిస్తున్నారో కూడా తాను ఎన్నడూ పట్టించుకోలేదని... తాను సంపాదించినది మాత్రమే అడిగేదాన్నని చెప్పారు. తనను విజయ్ ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడని... వాటి గురించి తాను ఎన్నడూ బయట చెప్పుకోలేదని తెలిపారు. ఆ ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

actor vijay
actress vanitha reddy
  • Loading...

More Telugu News