: గిన్నిస్ రికార్డు కొడుతున్న గుడివాడ ఆవు


సాధారణం గా మనం చూసే ఆవులు 3 నుంచి 4 అడుగుల ఎత్తు ఉండడం సహజం. కానీ కేరళ త్రిచూర్ జాతికి చెందిన ఈ ఆవు కేవలం 28 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండి చూపరులను విస్మయానికి గురిచేస్తోంది. అంతేనా.. ప్రపంచంలోనే అతిచిన్న ఆవుగా గిన్నిస్ బుక్ లో ఎక్కేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు గా అన్ని అర్హతలు ఉన్న ఈ చిట్టి గోవు మన రాష్ట్రంలోనే ఉంది.

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు నివాసి నేరుసు హర్షవర్ధన్ దీని యజమాని. ఇంతకు ముందు గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం అతి చిన్న ఆవు ఎత్తు 30 అంగుళాలు కాగా తన ఆవు 28 అంగుళాలే ఉందని హర్షవర్ధన్ గిన్నిస్ బుక్ వారికి సమాచారం ఇచ్చాడు. ఈ కేరళ జాతి ఆవు ఎత్తును పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు ధ్రువీకరించారు.


  • Loading...

More Telugu News