రోజారమణి: తనపై వచ్చే రూమర్స్ ను మా అబ్బాయే నాకు చెబుతుంటాడు!: హీరో తరుణ్ తల్లి రోజారమణి

  • రూమర్స్ వచ్చినప్పుడు బాధపడి ఏం చేస్తాం?
  • ఫ్రెండ్స్ తో మరీ ఎక్కువగా ఉండొద్దని తరుణ్ కి చెబుతా
  • హీరో తరుణ్ తల్లి రోజారమణి

తరుణ్ తనపై వచ్చే రూమర్స్ ను డైరెక్టుగా తనకు చెబుతాడని హీరో తరుణ్ తల్లి, నాటి నటి రోజారమణి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘తరుణ్ పై రూమర్స్ వస్తే.. నాపై ఇలాంటి రూమర్స్ వచ్చాయి .. చదివావా? విన్నావా?’ అని తరుణే నన్ను అడుగుతుంటాడు. పిల్లలకు తమ తల్లులు చెప్పినట్టుగానే నేను కూడా ‘మనం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ తో మరీ ఎక్కువగా ఉండొద్దు’ అని తరుణ్ కు చెబుతాను.

రూమర్స్ నిజమైనప్పుడు నేను సీరియస్ గా తీసుకుంటాను. రూమర్స్ నిజం కానప్పుడు మనం ఎవరిని బాధపెడతాం? కెరీర్ పరంగా ఎన్ని రాసినా ఫర్వాలేదు. పర్సనల్ విషయాల గురించి రాస్తే ఇబ్బంది. రూమర్స్ వచ్చినప్పుడు బాధపడి ఏం చేస్తాం?’ అని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News