Kiss Competition: ముద్దుల పోటీలు పెట్టి బహుమతులిచ్చిన ఎమ్మెల్యే!

  • ఆధునికతకు ప్రోత్సాహమంటూ పోటీలు
  • ఎక్కువ సేపు కిస్ చేసిన జంటలకు బహుమతులు
  • వెల్లువెత్తుతున్న విమర్శలు

ఆధునికతకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెబుతూ, జార్ఖండ్ ఎమ్మెల్యే నసైమన్ మరాండీ తన స్వగ్రామంలో నిర్వహించిన ముద్దుల పోటీ వివాదాస్పదమవుతోంది. ఆదివాసీయుల మధ్య ప్రేమను పెంచుతున్నామని, వారిని వృద్ధి బాటలోకి నడిపిస్తామని చెబుతూ, ఆయన ఆధ్వర్యంలో గాఢ చుంభనాల పోటీ జరుగగా, ఎక్కువ సేపు ముద్దు పెట్టుకున్న జంటలకు బహుమతులు కూడా అందించారు. ఇలా చేయడం వల్ల వారిలో ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుందని ఈ సందర్భంగా మరాండీ వ్యాఖ్యానించడం గమనార్హం. తాల్ పహాడీలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న వారంతా ఆదివాసీయులే కాగా, ఇలా బహిరంగ ముద్దుల పోటీలు ఏంటని మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Kiss Competition
Adivasis
Jarkhand
  • Loading...

More Telugu News