చంద్రబాబు: ఈసారి ఒక సినీ నటుడినో, మరొకర్నో చంద్రబాబు తన పక్కన పెట్టుకుంటారు!: వైఎస్ జగన్ ఎద్దేవా

  • ప్రజలు తనను నమ్మరేమోనని, ఈసారి ఒక సినీ నటుడినో, మరొకర్నో తెచ్చుకుంటారు
  • చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని క్షమిస్తే, మరోసారి మోసం చేస్తారు
  • పాదయాత్రలో వైఎస్ జగన్ విమర్శలు

ప్రజలు తనను నమ్మరేమోనని చెప్పి, ఈసారి ఒక సినీ నటుడినో, మరొకర్నో చంద్రబాబు తన పక్కన పెట్టుకుంటారని, బాబు గురించి ఆ నటుడు చెబుతారని వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుకు ఆయన పాదయాత్ర చేరుకుంది.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ‘చంద్రబాబుకు ఓటెయ్యండి.. పూచీ నాది’ అని ఆ యాక్టర్ అడుగుతాడని వ్యంగ్యంగా అన్నారు. అలాంటి పరిస్థితి మారాలని, విశ్వసనీయతకు పట్టం కట్టాలని తన పాదయాత్రలో జగన్ అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని క్షమిస్తే, మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు ఆయన ఈసారి కొత్త ఎత్తులు వేస్తారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి దానిని నాయకులు నెరవేర్చాలని, అలా చేయలేని పక్షంలో ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలని అన్నారు.

  • Loading...

More Telugu News