రాహుల్: రాహుల్ వస్తుంటే.. ‘మోదీ..మోదీ’ నినాదాలు!

  • గుజరాత్ లో రాహుల్ కు మరోమారు చేదు అనుభవం
  • శ్రీరంఛోడ్జీ ఆలయాన్ని సందర్శించి వస్తుండగా సంఘటన
  • చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్ లో మరోమారు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిమిత్తం అక్కడికి వెళ్లిన రాహుల్, ఖేదా దకోర్ లోని శ్రీరంఛోడ్జీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం, ఆలయం నుంచి బయటకు వస్తున్న రాహుల్ ని చూసిన అక్కడి ప్రజలు ‘మోదీ..మోదీ’ అని నినదించారు. అయితే, ఇవేవీ పట్టించుకోనట్టు రాహుల్ చిరునవ్వు చిందిస్తూ వెళ్లిపోవడం గమనార్హం. కాగా, గుజరాత్ లో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. కాంగ్రెస్, బీజేపీ, పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

  • Loading...

More Telugu News