Zaira Wasim: చేతులేశాడు... అసభ్యంగా తాకాడు: తన అనుభవాన్ని లైవ్ వీడియోలో కన్నీటితో చెప్పిన 'దంగల్' నటి జైరా

  • ఢిల్లీ, ముంబై విమానంలో ఘటన
  • మెడ తాకాడు, వీపు నిమిరాడు
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
  • ఏడుస్తూ చెప్పుకున్న జైరా

జైరా వాసిమ్... అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'దంగల్' చిత్రంలో తన అద్భుత నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి. ఇప్పుడామె, తనకు ఎదురైన వేధింపుల అనుభవాన్ని ఉబికి వస్తున్న కన్నీటిని దాచుకుంటూ, వీడియో రూపంలో వెల్లడించింది.

ఢిల్లీ నుంచి ముంబైకి విస్తారా విమానంలో తాను ప్రయాణిస్తున్న వేళ, వెనుక కూర్చున్న వ్యక్తి చేసిన పనిని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. తన వెనుక సీట్లో కూర్చున్న మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి, తన మెడను తాకుతూ, సీటు కింద నుంచి కాళ్లు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడని, ఇటువంటి ఘటన ఏ ఆడపిల్లకూ ఎదురు కాకూడదని చెప్పింది.

తన సీటుపై ఆ వ్యక్తి కాళ్లు పెట్టి, అసభ్యంగా తాకాడని, తాను అడిగితే, విమానం కుదుపుల వల్ల అలా పెట్టానని ఎదురు వాదించాడని, తన వీపు నిమిరాడని, విషయాన్ని సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. అమ్మాయిలను ఆదుకునేదెవరని ప్రశ్నించిన జైరా, ఎవరికి వారే సహాయం చేసుకునేలా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.

Zaira Wasim
Instagram
Live Video
Harrasment
Vistara Airlines
  • Error fetching data: Network response was not ok

More Telugu News