sleep: నిద్రలేమితో బాధపడుతున్నారా.. అయితే మీకోసమే ఈ పిల్లో రోబో!

  • అభివృద్ధి చేసిన స్టార్టప్ సంస్థ
  • శ్వాసక్రియను క్రమబద్ధీకరించి నిద్రను మెరుగుపరిచే రోబో
  • హార్ట్ బీట్, మ్యూజిక్‌ను కూడా ప్లే చేసి నిద్రపుచ్చనున్న ‘పిల్లో’

నిద్రలేమితో బాధపడుతున్న వారికి నెదర్లాండ్స్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ పిల్లోను పోలిన రోబోను తయారు చేసింది. ‘స్లీప్ రోబో’గా పిలిచే ఈ రోబో నిద్రలేమిని దూరం చేసి కావాల్సినంత సుఖ నిద్రను అందిస్తుందని దీని తయారుదారు ‘సోమ్‌నాక్స్’ పేర్కొంది. శ్వాస తీసుకునే ప్రక్రియను ఈ రోబో క్రమబద్ధీకరించడం ద్వారా నిద్ర లేమి సమస్యలను దూరం చేస్తుందని వివరించింది.

నిద్రపోయేటప్పుడు ఈ స్లీప్ రోబోను పక్కన పెట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు హాయిగా నిద్రపోవచ్చని చెబుతోంది. యాప్‌ను అనుసంధానం చేసిన ఈ పిల్లో హార్ట్ బీట్ లాంటి శబ్దాలతోపాటు మ్యూజిక్‌ను కూడా వినిపిస్తుంది. యూజర్ ఒకసారి గాఢ నిద్రలోకి జారుకున్నాక యాప్ ఆటోమెటిక్‌గా మ్యూజిక్ ఆపేస్తుందని ‘సోమ్‌నాక్స్’ వివరించింది.

  • Loading...

More Telugu News